Saturday, November 23, 2024

ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ సేవలకు అనుమతి: డీజీపీ

తెలంగాణ పోలీసులు లాక్ డౌన్ ను కఠిన ఆంక్షలతో అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్డు పైకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఫుడ్ డెలివరీ బాయ్స్ వాహనాలను కూడా సీజ్ చేశారు. తమకు ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు తమ వాహనాలను సీజ్ చేశారని డెలివరీ బాయ్స్ ఆందోళన చేశారు. దీంతో డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. ఫుడ్ డెలివరీ సేవలకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దు ఆదేశిచారు. నిత్యావసర, ఫుడ్ డెలివరీ సేవలకు, ఈ-కామర్స్ ద్వారా జరిగే సేవలకు ఎటువంటి ఆటకం కలగకుండా అధికారులను సూచనలు చేశారు. అయితే, కొంద‌రు రోడ్ల‌పైకి రావ‌డంతోనే క‌రోనా వ్యాప్తి చెందుతుందన్నారు. ఏ అవ‌స‌రం ఉన్నా ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల మ‌ధ్య‌నే బ‌య‌ట‌కు రావాలన్నారు. సీజ్ చేసిన వాహ‌నాల‌ను లాక్‌ డౌన్ త‌ర్వాతే అప్ప‌గిస్తామ‌ని చెప్పారు.

కాగా, లాక్ డౌన్ నిబంధనల పేరుతో శనివారం జొమాటో, స్విగ్గి డెలివరీ బాయ్స్ వాహనాలను సైతం పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కామర్స్ లో ఉన్న సేవలకు కూడా అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా తమను అపేస్తున్నారంటూ ఈ కామర్స్ డెలివరీ బాయ్స్ అవేదన వ్యక్తం చేశారు. జొమాటో తమకు పెనాల్టీ వేస్తుందని, పోలీసుల ఫైన్‌తో నష్డపోతామని బాయ్స్ వాపోయారు. నిత్యావసర వస్తువులు, ఈ కామర్స్ లో ఉన్న సేవలకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన జీవో నెం.102లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement