Sunday, January 5, 2025

e-car race scam – కెటిఆర్ క్వాష్ పిటిషన్ పై ముగిసిన వాదనలు … తీర్పు రిజర్వ్ ..

హైదరాబాద్ – ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి.. ఈ కేసును విచారించిన జస్టిస్ లక్ష్మణ్ తన తీర్పును రిజర్వ్ చేశారు.. అలాగే తీర్పు వచ్చేంతవరకు కెటిఆర్ ను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశించారు.. ఇక నేడు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ముందు కేటీఆర్ తరుపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ దవే తన వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్‌లో ఉన్న 409 సెక్షన్‌పై తొలుత వాదనలు జరిగాయి. ఈ కేసులో కేటీఆర్ కు సెక్షన్ 409 ఏమాత్రం వర్తించదని పేర్కొన్నారు. ఫార్ములా ఈ-కారు రేసింగ్ వ్యవహారంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని అన్నారు. సొంత ప్రయోజనాలకు కూడా ఆ డబ్బులను కేటీఆర్ వాడుకోలేదని తెలిపారు..

మొత్తం వ్యవహారంలో తన క్లయింట్‌కి ఒక్క రూపాయి రాలేదని కోర్టుకు తెలిపారు. ఒకవేళ కేటీఆర్‌కు 409 అప్లై చేస్తే దేశంలో గందరగోళం నెలకొనే ఛాన్స్ ఉందని వాదించారు. దేశంలో ఇకపై ఏ మంత్రి కూడా ఫైల్ మీద సంతకాలు చేయబోరని పేర్కొన్నారు. అందుకు సంబంధించి బాంబే హై కోర్టు నుంచి ఇప్పటి వరకు అన్నీ కేసుల ఉదాహరణలు తాను కోర్టుకు అందజేయగలని అన్నారు. పర్మిషన్ తీసుకోలేదనే విషయానికి సెక్షన్ 405 వర్తించదని ధర్మాసనానికి తెలిపారు. కేటీఆర్ ఓ మంత్రిగా నిర్ణయం తీసుకున్నారని, బ్యాంకింగ్ చానల్స్ ద్వారానే నిధులు ఆర్గనైజింగ్ టీంకు నిధులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని అన్నారు. ఏసీబీ అధికారులు చెబుతోన్న రూ.8 కోట్లు కూడా కేటీఆర్ ఖాతాలోకి వెళ్లవని ఆ డబ్బు కూడా నిర్వాహకులకే వెళ్తుందని సిద్ధార్థ్ దవే తన వాదనలు వినిపించారు. సిద్ధార్థ్ దవే వాదనలు విన్న కోర్టు బిఎన్ఎస్ వచ్చాక ఐపిఎస్ కింద ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నించింది. అందుకు ఆయన 14 నెలల క్రితం నేరం జరిగినందునే ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదైనట్లుగా కోర్టుకు తెలిపారు. డబ్బు చేరిన వ్యక్తిని నిందితుడిగా చేర్చలేదని.. ఆ విదేశీ సంస్థ పేరు ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ఎఫ్ ఈ వో వివరాలను కేటీఆర్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. విచారణ కొనసాగే క్రమంలో కేటీఆర్‌ను నిందితుడిగా చేర్చొచ్చు కదా అని హైకోర్టు తెలుపగా 13(1)(a) సెక్షన్ తన క్లయింట్‌కు వర్తించదని సిద్ధర్థ్ దవే అన్నారు. ఇక‌ ఎఫ్ఈఓతో అగ్నిమెంట్‌పై సంతకం చేసింది అధికారి అరవింద్ కుమార్, కేటీఆర్ కాదన్నారు. ఎఫ్ఈఓ ను ఏసీబీ అధికారులు నిందితుడిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.

- Advertisement -

ఈ కేసులో నిందితుడిగా కేటీఆర్ చేర్చినప్పుడు ఎఫ్ఈవో మాటేంటని ప్రశ్నించారు దవే. ఫార్ములా ఈ కారు రేస్ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) చేసిందని, వాళ్ళ‌ను ఎందుకు ఎఫ్ ఐ ఆర్ లో చేర్చలేదన్నారు. ఈ క్రమంలో న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు. విచారణ కొనసాగుతున్న క్రమంలో ఎఫ్ఈఓ ను నిందితుడిగా చేర్చవచ్చు కదా అని అన్నారు. ఈ – రేస్‌ను కొనసాగించాలన్న ఉద్దేశంతో నిధుల చెల్లింపులు జరిగాయి తప్ప అవినీతి లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను చదివి వినిపించారు న్యాయవాది దవే. కేటీఆర్‌ తరపున న్యాయవాది దవే వాదనలు ముగిశాయి.

లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఏసీబీ, ప్రభుత్వం తరపున ఎజి సుద‌ర్శ‌న్ రెడ్డి త‌న వాద‌న‌లు వినిపించారు.. గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తితోనే కేసు న‌మోదు చేశామ‌ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సంద‌ర్భంగా కేసు ద‌ర్యాప్తు ఎంత వ‌ర‌కు వ‌చ్చింద‌న్న న్యాయ‌మూర్తి ప్ర‌శ్న‌కు ఫిర్యాదుదారుడి స్టెట్మెంట్ ను రికార్డ్ చేశామ‌ని చెప్పారు. కాగా, ఈ కేసులో నిందితులిగా ఉన్న అర‌వింద్ కుమార్, రెడ్డిల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు.. కేసు ఇంకా విచార‌ణ ద‌శ‌లో ఉంద‌ని ఎజి వెల్ల‌డించారు.. అనంతరం హెచ్ఎండిఎ తరుపున న్యాయవాది తన వాదనలు వినిపించారు.. కెటిఆర్ తీసుకున్న నిర్ణయంతో రూ.8 కోట్లు నష్టం వచ్చిందన్నారు.. ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిధులను విడుదల చేశారంటూ న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి తీర్పును త‌ర్వాత వెలువ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement