Wednesday, January 8, 2025

e – car race – హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు కెటిఆర్

హైద‌రాబాద్ – హైకోర్టు తీర్పు వ్య‌తిరేకంగా రావ‌డంతో సుప్రీం కోర్టులో అప్పీల్ చేయాల‌ని బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిర్ణ‌యించారు.. త‌న న్యాయ‌వాదుల‌తో చ‌ర్చించిన అనంత‌రం హైకోర్టు తీర్పుపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో స‌వాల్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు..

కాగా , ఇప్ప‌టికే తొమ్మిదో తేదిన హాజ‌రు కావాల‌ని నోటీస్ లు ఇచ్చిన ఎసిబి నేడు మ‌రో నోటీస్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం .కొత్త నోటీస్ లో రేపు లేదా ఎల్లుండి విచారణకు పిలుస్తారని భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కేటీఆర్ ఈడీ విచారణకు ఇవాళే వెళ్లాల్సి ఉంది. కానీ, హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఉంది.. తనకు విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని ఈడీ అధికారులను కేటీఆర్ కోరారు.

దీంతో ఈడీ అధికారులు కేటీఆర్ విజ్ఞప్తికి సుముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటీషన్ కొట్టివేయడంతో ఏసీబీతో పాటు ఈడీ అధికారులుసైతం కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి రెండుమూడు రోజుల్లోనే విచారణకు రావాలని ఆదేశించే అవకాశాలు లేకపోలేదు. విచారణ సమయంలో కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న వాదన బ‌లంగా వినిపిస్తున్న‌ది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement