Wednesday, January 15, 2025

e – car race – కేటీఆర్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

హైదరాబాద్ – ఫార్ములా-ఈ కారు రేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేటీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్‌ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 8న ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

.ఇక, కేటీఆర్ పిటిషన్‌పై జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ చేయనుంది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఫార్ములా-ఈ కారు రేసు కేసుపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement