హైదరాబాద్ – ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో హెచ్ ఎం డి ఎ పరిధికి మించి డబ్బు బదిలీ చేసిందని హైకోర్టు అభిప్రాయపడింది.. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని హైకోర్టు సూచించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన నేపధ్యంలో జడ్జి లక్ష్మణ్ తన ఆర్డర్ కాపీలో సంచలన అంశాలు ప్రస్తావించారు. కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని అంటున్నారని, చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణకు తగిన సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై ఏసీబీ ఆధారాలు సేకరించాలని, ఫార్ములా ఈ-రేస్ కేసులో మేం ఇప్పడే జోక్యం చేసుకోమని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఈ-రేస్ వ్యవహారంలో ఏం జరిగిందో దర్యాప్తులో తేలుతుందని, ఈ తీర్పు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌కు మాత్రమే వర్తిస్తుందని హైకోర్టు వెల్లడించింది.
క్వాష్ డిస్మిస్! తీర్పు కాపీలో కీలకాంశాలివే…
ఎఫ్ఎస్ఐఆర్ పేర్కొన్న ఆరోపణలు…
- కేటీఆర్ నిధులు దుర్వినియోగం చేశారు.
- అధికార దుర్వినియోగమని జరిగింది
- నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదిలీ
రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది. - కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలి
కేటీఆర్ ఆదేశాలతోనే బదిలీ జరిగిందంటున్నారు.
చెల్లింపులతో ఎవరు లబ్ది పొందారన్నది తెలియాలి
ఒప్పంద సంస్థలకే లబ్ది చేకూర్చారు
ఎఫ్ఎర్ను కొట్టేసేది కొన్ని సందర్భాల్లోనే దర్యాప్తు అన్యాయంగా ఉంటేనే అది సాధ్యం - పోలీస్ అధికారాలను హరించలేం
ఏసీబీ ఆరోపణలపై మేం విచారణ చేయాలనుకోవడం లేదు.
ప్రజా ధనానికి మంత్రులు ట్రస్టీలుగా పనిచేయరన్న కేటీఆర్ న్యాయవాది
తీవ్రంగా విభేదించిన ఉన్నత న్యాయస్థానం - ప్రభుత్వ ఆస్తులకు మంత్రులు బాధ్యులుగా ఉండాలని వ్యాఖ్య
- పలు కేసుల్లో సుప్రీమ్ తీర్పులను పేర్కొన్న న్యాయమూర్తి
ఉత్తమ పాలన అందించే బాధ్యత మంత్రిపైనే ఉంటుందని స్పష్టీకరణ - నాట్ టు అరెస్ట్ ఉత్తర్వులు కోరిన కేటీఆర్ న్యాయవాది
- ఈ సమయంలో అలాంటి ఉత్తర్వులివ్వలేమన్న హైకోర్టు