హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఫార్ములా ఈ కారు రేసు కేసులో కెటిఆర్ తో ఎసిబి విచారణ ముగిసింది… ఇప్పటివరకు అధికారులను విచారించింది ఏసీబీ.. గురువారం ఏ-1నిందితుడిగా ఉన్న కేటీఆర్ తో నేటి ఉదయం విచారణ చేపట్టింది. మొత్తం ఏడు గంటల పాటు వివిధ అంశాలపై ప్రశ్నలు సంధించి కెటిఆర్ నుంచి సమాధానాలు రాబట్టారు..
రూల్స్ ఎందుకు బ్రేక్ చేశారు..
తొలుత హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంపై ప్రశ్నలు సంధించారు. ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, దాన కిషోర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధించారు. రూల్స్ ఎందుకు బ్రేక్ చేశారు? బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు? నిధుల బదిలీపై ఆర్థికశాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు?
ఎన్నికల కోడ్ ఎందుకు ఉల్లంఘించారు..
నిధులు బదిలీ చేయాలనీ ఎవర్ని ఆదేశించారు? బలవంతం చేశారా? ఎన్నికల కోడ్ ఎందుకు ఉల్లంఘించారు? అప్పటి సీఎం పర్మిషన్ తీసుకున్నారా? ఏకపక్ష నిర్ణయం ఏ లెక్కన తీసుకున్నారు? అనే ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఇక.. ఫార్ములా ఈ రేసు నిర్వహణ సంస్థకు అగ్రిమెంట్లు వ్యవహారాన్ని ఏసీబీ ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. తొలుత రేసింగ్ నిర్వహించినప్పుడు నిధులు ఏ విధంగా చెల్లించారు? స్పాన్సర్‌గా గ్రీన్ కో కంపెనీని ఎవరు ప్రతిపాదించారు? ఎఫ్ఈవో కంపెనీ పెట్టుకుందా? స్పాన్సర్‌గా ఉండాలని మీరు కోరారా? అని ప్రశ్నించినట్టు సమాచారం.
అంతకు ముందు ఉదయం ఇంటి నుంచి నేరుగా ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్ తన న్యాయవాది రామచంద్రరావుతో చేరుకున్నారు. . ఆ వాహనాన్ని గురించిన పోలీసులు, గేటు తీసి లోపలికి పంపారు. కేటీఆర్ తన కారు పార్కింగ్ చేసి ఆఫీసులోకి వెళ్లారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలోకి కేటీఆర్‌ను అధికారులు తీసుకెళ్లారు. లాయర్‌ను పక్క రూమ్‌లో కూర్చోబెట్టారు. 10 నిమిషాల తర్వాత విచారణ అధికారులు కేటీఆర్ రూమ్‌లోకి ఫైల్స్ పట్టుకుని వచ్చారు. కేటీఆర్‌ను ముగ్గురు అధికారులు విచారించారు.. మధ్యలో అరగంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు..