కెటిఆర్ సుప్రీంను ఆశ్రయిస్తే మా వాదనలు వినండి…
ముందుగానే మేల్కొన్న ప్రభుత్వం
ఈ కార్ రేస్ కేసులో రేవంత్ దూకుడు…
హైదరాబాద్ – ఈ ఫార్ములా రేస్ కేసులో రేవంత్ సర్కార్ మరింత దూకుడు పెంచింది.. హైకోర్టు తీర్పుపై కెటిఆర్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్న వార్తల నేపథ్యంలో వెంటనే ప్రభుత్వ స్పందించింది.. కెటిఆర్ కంటే ముందునే సుప్రీం కోర్టు కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది.. బిఆర్ఎస్ నేత కెటిఆర్ పిటిషన్ విచారించే సమయంలో తమ వాదనలు కూడా వినాలని ఈ పిటిషన్ లో ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్ధించింది.. తమ వైపు వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవలసిందిగా కోరింది..
- Advertisement -