హైదరాబాద్ : ఫార్ముల ఈ కార్ రేస్ కేసులో హైకోర్టు తీర్పుతో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు లాయర్‌ను అనుమతించాలని కోరుతూ లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు దీనిని హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు . . అదే సమయంలో లైబ్రరీ రూంలో కెటిఆర్ లాయర్ కూర్చునేందుకు హైకోర్టు అనుమతించింది. కేటీఆర్ ఓగదిలో, లాయర్ మరో గదిలో ఉండాలని హైకోర్టు సూచించింది.
ఆడియో, వీడియో రికార్డింగ్ చేయరాదని కోరింది.ఇక కెటిఆర్ కు ఎసిబి విచారణలో ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టుకు రావొచ్చన్న హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. అలాగే రేపు జరిగే విచారణకు కెటిఆర్ హాజరకావాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -