Wednesday, January 8, 2025

e – car race case – కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : ఫార్ములా- ఈ కారు రేసు కేసు వ్యవహారంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న తమ ఎదుట విచారణకు రావాలని మంగళవారం నోటీసు ఇచ్చింది. కాగా గతంలో ఇచ్చిన నోటీసుల ప్రకారం కేటీఆర్ ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ హైకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉందని తీర్పు వెలువడే వరకు విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలంటూ నిన్న ఈడీకి కేటీఆర్ ఈ-మెయిల్ ద్వారా కోరారు. కేటీఆర్ విజ్ఞప్తిపై స్పందించిన ఈడీ సానుకూలంగా స్పందించింది. రిజర్వ్ లో ఉన్న తీర్పు ఇవాళ వెలువడింది. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం రావాలంటూ తాజాగా నోటీసులు జారీ చేసింది.

ఎదురు దెబ్బ‌ల నుంచి బ‌లంగా పుంజుకుంటాం…
తాజా పరిణామాలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నామాటలు రాసిపెట్టుకోండి. ఈ ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం. ఈ అబద్దాలు నన్ను దెబ్బతీయలేవు. మీ ఆరోపణలు నన్ను తగ్గించలేవు. కుట్రలతో నా నోరు మూయించలేరు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి తీస్తాయి. నేను న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. కాలంతో పాటు నిజాలు బయటకు వస్తాయి’ అంటూ కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement