ఈ కార్ రేసులో ఎ3 నిందితుడు
నేడు విచారణకు రావాలని ఈడీ నోటీసులు
మరో తేదిని కేటాయించవలసిందిగా రెడ్డి ఈ మెయిల్
హైదరాబాద్ – ఫార్ములా ఈ రేస్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు ఈడి ముందుకు విచారణకు హాజరు కాలేదు. నేడు విచారణ రావాల్సిందిగా గతంలోనే నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. అయితే తనకు మరికొంత సమయం కావాలని కోరుతూ ఫార్ములా ఈ రేస్ కేసు ను దర్యాప్తు జరుపుతున్న జాయింట్ డైరెక్టర్ కు మెయిల్ చేశారు రెడ్డి. తనకు మరో తేదిని కేటాయించాలని ఆ మెయిల్ లో కోరారు. దీనికి అంగీకరించిన అధికారులు త్వరలోనే కొత్త తేదితో మరో నోటీస్ పంపుతామని సమాధానం ఇచ్చారు..
ఇదే కేసులో ఇప్పటికే శుక్రవారం ఈడీ ముందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ రాబోతున్నారు . ఈ క్రమంలో ఈనెల 7న విచారణకు రావాలని కేటీఆర్‌కు సమన్లు పంపించింది . ఆ రోజు కెటిఆర్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు.