హైదరాబాద్ – ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 6వ తేదీన విచారణకు హాజరుకావాలని జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. కేటీఆర్‌తో పాటు ఈ కేసులో ఎ2, ఎ3 గా ఉన్న అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి , లకు కూడా నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని విచారించనున్నట్లు సమాచారం. ఇక ఇదే కేసులో కెటిఆర్ తో పాటు ఇద్దరు నిందితులను విచారణకు రావల్సిందిగా ఈడీ కూడా నోటీస్ లు అందజేసింది.
- Advertisement -