హైదరాబాద్ – ఈ ఫార్ములా కారు రేసులో ఎటువంటి స్కామ్ లేదని మీ నేతలు అంటున్నా…మీరేమో జరిగిందని గోల చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఎంపి బాల్క సుమన్ ధ్వజమెత్తారు.. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఎమ్మెల్యే దానం నాగేందర్ , మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియోలను పోస్ట్ చేశారు.
ఫార్ములా ఈని హైదరాబాద్లో నిర్వహించడం వలన నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందని ఒకవైపు కాంగ్రెస్ ఎంఎల్ఏ దానం నాగేందర్ చెప్తున్నారని అందులో పేర్కొన్నారు… మరోవైపు డబ్బులు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాయో మాకు తెలుసని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంగా చెప్పిన విషయాన్ని బాల్క సుమన్ ప్రస్తావించారు.
ఇలా స్వయంగా సొంత పార్టీ నేతలే చెప్తుంటే.. పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చగా కనబడినట్లు ఒక్క రేవంత్ కి మాత్రమే ఫార్ములా ఈలో తప్పు కనబడుతుందంటూ ఆయన ఎత్తిపొడిచారు..