హైదరాబాద్ – బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ క్వాష్ పిటిషన్ ను నేడు హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఎసిబి దూకుడు పెంచింది.. ఈ కార్ రేస్ కి స్పాన్సర్ చేసిన గ్రీన్ కో కార్యాలయాలపై ఉదయం నుంచి సోదాలు చేపట్టింది.. హైదరాబాద్, విజయవాడ , మచిలీపట్నం ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి.. అలాగే ఆ సంస్థ అనుబంధ కార్యాలయాలలో సైతం ఎసిబి తనిఖీలు చేపట్టింది.. విశాఖ పట్నంకు ఒక బృందం ఇప్పటికే చేరినట్లు సమాచారం .. అక్కడ కూడా సోదాలు జరపనున్నారు..గ్రీన్ కో ఎనర్జీ సంస్థ అధినేత చలమలశెట్టి సునీల్ ది స్వస్థలం మచిలీపట్నం కావడం విశేషం..
ఇది ఇలా ఉంటే , హైకోర్టు తీర్పు నేపథ్యంలో కెటిఆర్ తన న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు.. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ కు గాన, సుప్రీం కోర్టులో గాని తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయవచ్చని భావిస్తున్నారు.. ఇక కెటిఆర్ నివాసానికి హారీశ్ , కవితలతో సహా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు.. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ భారీ గా పోలీసులను మోహరించారు..