కార్ రేస్ కేసులో అఫిడవిట్ దాఖలు చేసిన కెటిఆర్ ..
తనపై దాఖలైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్
విచారణలో భాగంగా అఫిడవిట్ దాఖలు
విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం నా విధి
చెల్లింపులు వ్యవహారం బ్యాంకుల బాధ్యత
నిధుల బదిలీ మంత్రిగా నా బాధ్యత కాదు
హైదరాబాద్ – ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశం పొందిన కేటీఆర్.. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటీషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఆయన నేడు ఏసీబీ కౌంటర్‌కు సమాధానమిచ్చారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు.
- ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత…మంత్రిగా తనది కాదన్నారు.
- విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారాన్ని…సంబంధిత బ్యాంక్ చూసుకోవాలని అన్నారు.
- ఈ-కార్ రేస్‌కు ప్రమోటర్‌గా బాధ్యతలు తీసుకునే ముందు చెల్లింపుల విషయంలో చట్ట ప్రకారం అన్ని అంశాలను…చట్టబద్ధమైన సంస్థ అయిన హెచ్ ఎం డి ఎ నే చూసుకోవాలని తెలిపారు.
- రూ.10 కోట్లు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్నఎంఎండిఎ నిబంధనల్లో ఎక్కడా లేదని అన్నారు.
- నిధుల బదిలీ మంత్రిగా తనకు సంబంధం లేదని పేర్కొన్నారు.
- 10వ సీజన్ పోటీలు జరగలేదు కాబట్టి రీఫండ్ కోసం ఫార్ములా ఈ-రేస్ సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.