Monday, November 18, 2024

TG: చ‌నిపోతున్నా… కంటికి క‌నిపించ‌డం లేదా : కేటీఆర్

తెలంగాణ‌లో డెంగ్యూతో మ‌ర‌ణాలు
రోజుకు ఇద్ద‌రి కంటే ఎక్కువగా మృతులు
అయినా లేవ‌ని ప్ర‌క‌టిస్తారా
రేవంత్ స‌ర్కార్ పై కేటీఆర్ ఆగ్ర‌హం
వాస్త‌వాలు తెలుసుకుని ప్రాణాలు కాపాడండి


హైదరాబాద్: రాష్ట్రంలో అసలు డెంగ్యూ మరణాలే లేవంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. డెంగ్యూతో నిన్న(ఆదివారం) ఐదుగురు చనిపోయారని, ఇవాళ మరో ముగ్గురు మృతిచెందారంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయని నేడు ఎక్స్ లో ఆయ‌న ట్వీట్ చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అసలు డెంగ్యూ మరణాలే లేవంటూ చెబుతోందని మండిపడ్డారు. ఈ మేరకు వార్తా పత్రికలకు సంబంధించిన క్లిప్పింగులను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు.

డేటా ఎవ‌రు దాస్తున్నారు..
మరణాల డేటాను ఎవరు దాస్తున్నారు, ఎందుకు దాస్తున్నారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు ఆస్పత్రుల్లో సరిపడా మందులు లేక రోగులు అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ఆస్పత్రుల్లో ఒకే బెడ్‌పై ముగ్గురు, నలుగురు పేషంట్లు పడుకుంటున్నారని ఆగ్రహించారు. దీని ద్వారా డెంగ్యూ సమస్య తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఎక్స్ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు. కాగా అంగన్వాడీ కేంద్రాల్లో కుళ్లిన కోడిగుడ్లు పెడుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది కాంగ్రెస్ ప్ర‌భుత్వం అంటూ ధ్వజమెత్తారు. దీనిపై కూడా స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement