ఖమ్మం జిల్లాలోని వైరాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు వైరాలో అమృత్ 2.0 పథకం పనులతో పాటు 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు..
అనంతరం మధ్యాహ్నం 12-30 గంటలకు భట్టి స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో ఆలయం వద్ద స్నానఘట్టాలు, చెక్‌డ్యామ్, ప్రహరీ గోడ నిర్మాణ పనులు, అనంతరం వైరా రిజర్వాయర్, ప్రహరీ గోడ ఆధునిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి ప్రజలతో కాసేపు ముచ్చటించనున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులపై ప్రజలతో మాట్లాడి ఆరా తీయనున్నట్లు సమాచారం.
- Advertisement -