Friday, November 22, 2024

Review – బ‌డ్జెట్ లో బిసి సంక్షేమం… స‌మీక్షించిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి..

హైద‌రాబాద్ – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ర‌వాణ‌, బీసీ సంక్షేమ శాఖపై బడ్జెట్ సన్నాహక సమీక్షా సమావేశం నేడు స‌చివాల‌యంలో నిర్వ‌హించారు. ఈ సమీక్షా సమావేశానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రెటరీ హరిత, బీసీ వెల్ఫెర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం , వాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, రవాణా శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ద ప్రకాష్, ఆర్టీసీ ఎండి సజ్జనార్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు హాజరయ్యారు

ఈ స‌మావేశంలో గతంలో బీసీ సంక్షేమానికి కేటాయించిన నిధులు ప్రస్తుతం బడ్జెట్ లో కటాయించాల్సిన అంశాల పై చర్చించారు. ప్రధానంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ , కల్యాణ లక్ష్మి, బీసీ విద్యార్థుల స్కాలర్ షిప్ లకి సంబంధించి కేటాయించాల్సిన నిధులు పై మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.. బీసీ గురుకులాలకు సొంత భవనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని. ప్రస్తుతం సంవత్సరానికి 300 మందికి ఓవర్సిస్ స్కాలర్ షిప్ మంజూరు చేస్తుండగా వాటిని మరింత మందికి పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి విజ్ఞప్తి చేశారు.

కల్యాణ ల‌క్ష్మీ – తులం బంగారంపై చ‌ర్చ‌

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కల్యాణ లక్ష్మి కి అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇవ్వడంతో కళ్యాణ లక్ష్మి పథకానికి అదనంగా బడ్జెట్ లో కేటాయించాల్సిన నిధులు పై చర్చించారు.. బీసీ హాస్టల్ లని మరింత అభివృద్ధి చేయాలని… తెలంగాణ బీసీ కుల గణన చేస్తామని హామీ ఇవ్వడంతో దానికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. పాత జిల్లాలకి బీసీ స్టడీ సర్కిల్ లకి పక్కా భవనాలు ఉండడంతో కొత్త జిల్లాలకి బిల్డింగ్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.. సావిత్రి భాయ్ అభ్యుదయ యోజన కింద బాలికల విద్య మరింత ముందుకు తీసుకుపోవాలని అధికారులను ఆదేశించారు.

కుల వృత్తుల్లో చదువుకున్న వారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి స్కిల్ డెవలప్మెంట్ కి శిక్షణ కార్యక్రమాల పై అధ్యయనం చేయాలని సూచించారు.. గీతా వృత్తిదారులకు అదునాతన సేఫ్టీ మోకులు సబ్సిడీతో అందించేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బీసీ డిక్లరేషన్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండని దానికి అనుగుణంగా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రి డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్కకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement