Friday, November 22, 2024

Dusserah Celebrations – అశ్వవాహ‌నంపై ఊరేగిన శ్రీ అనంత పద్మనాభ స్వామి

వికారాబాద్, అక్టోబర్ 23 ( ప్రభ న్యూస్): విజయదశమి సందర్భంగా అనంతగిరి శ్రీ లక్ష్మీ అనంత పద్మ స్వామి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం చేరుకొని పది రోజులపాటు వివిధ వాహనాలపై ఊరేగిన స్వామివారు విజయదశమి సందర్భంగా సోమవారం సాయంత్రం అశ్వవాహానంపై ఊరేగారు. ఆలంపల్లి నుండి బయలుదేరిన స్వామివారు అశ్వ వాహనంపై ఉన్న శ్రీ లక్ష్మీ అనంత పద్మ స్వామికి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పూజలు నిర్వహించి స్వాగతం పలికారు పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ప్రతిపక్ష నాయకులు సుధాకర్ రెడ్డి మాజీ మార్కెట్ చైర్పర్సన్ ముద్దదీప వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిలర్లు కిరణ్ పటేల్ తదితరులు స్వామివారికి స్వాగతం పలికి భక్తిశ్రద్ధలతో పూజించారు ఆలంపల్లి నుండి బయలుదేరిన ఈ వాహన సేవ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తా వరకు కొనసాగి తిరిగి ఆలముపల్లికి చేరుకుంటుంది.

శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆనంద్

విజయదశమి ఉత్సవంలో భాగంగా ఆలంపల్లి శ్రీ అనంతపద్మనాభ స్వామిని వికారాబాద్ ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. సతీమణి సబిత ఆనంద్ తో పాటు కుమార్తె కుమార్తె కలిసి ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆ పద్మనాభుని కోరుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలోబీసీ కమిషన్ మెంబర్ శుభప్రద పటేల్ ఆలయ ట్రస్ట్రీ పద్మనాభం అర్చకులు అనంతగిరి చారి సిబ్బంది శాంత కుమార్ కౌన్సిలర్లు మేక పావని చంద్రశేఖర్ రెడ్డి కిరణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement