హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు రేపట్నుంచి నుంచి సెలవులు ప్రకటించారు. ఇవాళ ప్రతి పాఠశాల, కళాశాలలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలతో తరలివచ్చారు.
బతుకమ్మ పాటలకు బొడ్డెమ్మలు ఆడారు అమ్మాయిలు. ఇక ప్రభుత్వ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులు తమ ఊర్లకు తరలివెళ్లారు. దీంతో ఆర్టీసీ బస్సులు విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి. ఒకటవ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్ఏ-1) పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మరోవైపు ఫార్మెటివ్ అసెస్‌మెంట్-1,2 పరీక్షల మార్కులను గురువారం లోపు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇక జూనియర్ కాలేజీలకు ఈ నెల 19 నుంచి 25 వరకు సెలవులిచ్చింది ప్రభుత్వం. తిరిగి ఈనెల 26వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.