Friday, September 20, 2024

dussehra – తెలంగాణ‌లో ద‌స‌రా సెల‌వులు ఇవే…

హైద‌రాబాద్ – గణేష్ నవరాత్రి ఉవత్సవాలు ముగిసాయి. ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాలు రానున్నాయి. తెలుగు మాస క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీన రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులను డిక్లేర్ చేసింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 15వ తేదీ నుంచి యధావిధంగా స్కూల్స్ ప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీన వచ్చింది. దీనికి ముందు బతుకమ్మ సంబరాలు తొమ్మిరోజుల పాటు కొనసాగనున్నాయి. ఎంగిలి బతుకమ్మ పండుగ అక్టోబర్ 2వ తేదీన చేస్తారు. ఆ తరువాత దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి. అంటే దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు చేసుకోనున్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement