ఆన్‌లైన్ పేమెంట్స్ జనజీవనంలో ఓ భాగంగా మారిపోయాయి. చాలామంది జేబులో డబ్బులు ఉంచుకోవడం కూడా మానేస్తున్నారు. ఈ క్రమంలో యాచకులు ఎదురైతే జేబులు తడుముకొని చిల్లర లేదని చెప్పడం పరిపాటిగా మారింది.
దీంతో యాచకులు కూడా కాలానుగుణంగా మారుతూ క్యూఆర్ కోడ్ వెంట తీసుకెళ్తున్నారు. ఆ కోవలోనే సికింద్రాబాద్ ప్రాంతంలో ఓ ఆలయం వద్ద తన గంగిరెద్దు తలపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశాడు. గంగిరెద్దు విన్యాసాలు పూర్తి అయిన తర్వాత ప్రజలు స్కాన్ చేసి డబ్బు పంపగానే ‘అయ్యగారికి దండం పెట్టు’ అంటూ డూడూబసవన్నతో దండాలు పెట్టించి దీవిస్తున్నాడు ఈ యాచకుడు.