Friday, November 22, 2024

Dubbaka – నామినేషన్ దాఖలు చేసినబిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు

దుబ్బాక రూరల్:- రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా దుబ్బాక నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవనేని రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు.. నియోజ‌క‌వ‌ర్గ రిట‌ర్నింగ్ అధికారికి త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు బిజెపిని ఆదరించి తనను ఎమ్మెల్యేగా గెలిపించార‌ని, అదే స్ఫూర్తితో 2023 లో జరిగే ఈ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో బీసీ కులాలకు చెందిన నాయకుడినే జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ బీసీ నాయకున్ని ముఖ్యమంత్రిగా చేస్తుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement