హైదరాబాద్ -సీనియర్ నేత డి శ్రీనివాస్ నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరారు.. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, చేరింది తన కుమారుడు సంజయ్ అని డి శ్రీనివాస్ తేల్చి చెప్పారు.. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జీ మానిక్ థాక్రేకు ఒక లేఖ రాశారు. అలాగే డిఎస్ భార్య సైతం మరో లేఖను విడుదల చేశారు.. తాను ఎప్పుడూ కాంగ్రెస్ వాదినేనని ఆ లేఖలో పేర్కొన్నారు.. తన కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే తాను ఆశీర్వదించడానికి మాత్రమే వచ్చానని తెలిపారు.. తన వయస్సు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, తనను ఎటువంటి వివాదాలలోకి లాగవద్దని కాంగ్రెస్ అగ్రనేతలను కోరారు.. డిఎస్ భార్య విడుదల చేసిన మరోలేఖలో డిఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.. దీంతో డిఎస్ కుటుంబంలో అంతర్గత కలహాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి.. డిఎస్ మరో కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బిజెపి లోక్‌సభ సభ్యుడిగా నిజామాబాద్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. దీంతో సహజంగా డిఎస్ బిజెపికి దగ్గరవుతున్నారనే వార్తలు వినవస్తున్నాయి.. కాగా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డిఎస్ అప్పటి టిఆర్ఎస్ లో చేరారు.. అయితే అ పార్టీలోక్రీయాశీలకంగా వ్యవహరించకుండా అంటీముట్టనట్లుగా కొనసాగారు.. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు ఆకస్మికంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి, ఆందులో చేరారు. ఇంతలోనే తూచ్ ఆ పార్టీలో చేరలేదంటూ ఒక లేఖను విడుదల చేశారు.. తాను పార్టీలోచేరినట్లు భావిస్తే ఈ లేఖను రాజీనామాగా భావించాలని డిఎస్ లేఖలో కోరారు..
కాంగ్రెస్ నేతలు మా ఇంటికి రావద్దు – విజయలక్ష్మీ..
నిన్న పార్టీలో చేరమని మీరు చేసిన ఒత్తిడి వల్ల ఆయనకు రాత్రి ఫిట్స్ వచ్చిందంటూ డిఎస్ సతీమణి విజయలక్ష్మీ కాంగ్రెస్ పెద్దలకు రాసిన లేఖలో వివరించారు.. రాజకీయాలకు ఆయనను వాడుకోవద్దంటూ కోరారు.. వయస్సు రీత్యా ఆయనను ప్రశాంతంగా బతకనీయండి అంటూ కాంగెస్ నేతలకు దండం పెట్టి అభ్యర్ధించారు. ఇంకోసారి మా ఇంటివైపు, మా వైపు రావద్దంటూ విజయలక్ష్మీ కోరారు..