హైదరాబాద్ – కొత్త సంవత్సరం రోజున ఓ మందు బాబు తాగుడులో సరికొత్త రికార్డ్ సృష్టించాడు.. ఎవరికీ సాధ్యంకాని రీతిలో తాగేసి చిక్కిన అతడిని పోలీసులు చూసి అవాక్కయ్యారు.. ఇక వివరాలలోకి వెళితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నియంత్రించడానికి పోలీసులు తనిఖీలు చేస్తుంటారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే కేసు నమోదు చేయడం సర్వసాధారణం. ఎవరైనా తాగి బైక్ లేదా ఇతర వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులకు అనుమానం వస్తే వెంటనే వారిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం తాగింది లేనిది నిర్ధారిస్తారు. 100 మి.లీ రక్తంలో ఎంత ఆల్కహల్ శాతం ఉందనేది లెక్కించి 30 మి.గ్రాములు దాటితే పోలీసులు కేసు నమోదు చేస్తారు. సాధారణంగా వంద మి.లీ రక్తంలో 50 మి.గ్రాముల ఆల్కహల్ శాతం ఉంటే ఆ వ్యక్తి స్పృహాలో లేనట్లు గుర్తిస్తారు. బ్రీత్ అనలైజర్‌లో వందకు మించి ఆల్కహల్ శాతం నమోదైన సందర్భాలు లేకపోలేదు.
550 రీడింగ్ తో సరికొత్త రికార్డ్ ..
ఇక మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని పంజాగుట్ట సమీపంలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పంజాగుట్ట సమీపంలో గత రాత్రి 10.50 గంటల సమయంలో పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, వెంగళరావు పార్క్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ మార్గంలో TS09EK3617 బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని పోలీసులు ఆపి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేశారు. 550 ఆల్కహాల్ రీడింగ్ నమోదైంది. రీడింగ్ చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తి పేరు తెలియనప్పటికీ ఆ బైక్ మాత్రం రియాజుద్దీన్ పేరుమీద ఉంది. బైక్ సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన నెటిజన్ ఆ మందు బాబుకు అస్కార్ అవార్డు ఇవ్వాలని అంటున్నారు.
ఉదయం ఒక కేసు.. రాత్రి మరో కేసు.
ఉదయం ఓ కేసు.. రాత్రికి డ్రంక్ అండ్ డ్రైవ్..TS09EK3617 బైక్‌పై 31 డిసెంబర్ 2024 ఉదయం 9.17 గంటలకు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్న కేసు నమోదైంది. అదే బైక్‌పై రాత్రి 10.53 గంటలకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. ఉదయం హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నారంటూ ఆషిఫ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల ఫైన్ వేయగా.. రాత్రి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. ఈ బైక్‌పై ఇప్పటివరకు పది చలనాలు పెండింగ్ ఉండగా.. ఇవ్వన్నీ హెల్మెట్‌కు సంబంధించినవే. దీంతో అతడి బైక్ ను సీజ్ చేసి, ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తరలించారు..