Saturday, January 4, 2025

Drunken & Drive – జోష్ ‘ మత్తు ‘ దించిన పోలీస్ లు

హైదరాబాద్ – తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలు అత్యంత భారీగా జరిగాయి. ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో డీజేలు, డ్యాన్స్‌లు, విందులతో సందడి చేశారు.

అయితే, . చెప్పినట్లుగానే.. న్యూ ఇయర్‌ సందర్భంగా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్లపై మందుబాబులు పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా మొత్తం 1184 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయని పోలీస్ అధికారులు తెలిపారు.

ఈ కేసుల సమయంలో కొన్ని చోట్ల ట్రాఫిక్‌ పోలీసులతో మందుబాబులు వాగ్వాదానికి దిగిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

- Advertisement -

ఇక జోన్‌ల వారీగా కేసుల వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. ఈస్ట్‌ జోన్ లో 236, సౌత్‌ ఈస్ట్‌ జోన్ లో 192, వెస్ట్‌ జోన్ లో 179, సౌత్‌ వెస్ట్‌ జోన్ లో 179, నార్త్‌ జోన్ లో 177, సెంట్రల్‌ జోన్ లో 102 కేసులు నమోదయ్యాయి.

ఇక పోలీసుల కఠిన తనిఖీలను చూసిన కొందరు, కొన్ని చోట్ల మందుబాబులు బైక్‌లను వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ, పోలీసులు వారిని పట్టుకుని సరైన చర్యలు చేపట్టారు. ఈ పోలీసులు ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వంటి ప్రమాదకర చర్యలు తగవని, ఇతరుల జీవితాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించవద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement