Saturday, November 23, 2024

Shame | ఫుల్​గా​ తాగొచ్చిన ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి.. ఉచ్చ ఆపుకోలేక అందరిముందే డస్ట్​బిన్​లో..

ఫుల్​గా తాగి డ్యూటీకి వచ్చిన ఓ ఉద్యోగి తాను పనిచేస్తున్న చోటనే యూరిన్​ చేసిన ఘటన మహబుబాబాద్​ జిల్లాలో జరిగింది. మహబుబాబాద్​ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన వారి ముందే తాత్కాలిక ఉద్యోగి జిప్​ తీసి అక్కడ ఉన్న డస్ట్​బిన్​లో యూరిన్​ (ఉచ్చ) చేయడాన్ని అందరూ తిట్టిపోస్తున్నారు. ఇదేం పనిరా నాయనా అంటూ ఇష్టమున్నట్టు తిడుతున్నారు. ఒక ఏజెన్సీ ద్వారా తాత్కాలికంగా నియమితుడైన ఆ ఉద్యోగి ఆస్పత్రికి రోజూ మద్యం తాగి రావడమే కాకుండా పట్టపగలు అందరూ చూస్తుండగానే ఇట్లాంటి రోత పనికి పాల్పడ్డాడు.

ఇక.. అదికూడా ఆస్పత్రికి వచ్చిన వారికి లేడీ డాక్టర్​ ట్రీట్​మెంట్​ చేస్తుండగానే ఆ పక్కనే ఉన్న డస్ట్​బిన్​లో జిప్​ తీసి యూరిన్​ చేశాడు. దీనిపై రోగులు, సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆస్పత్రి సూపరింటెండెంట్​ అస్సలు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి దారుణమైన, రోత పనులు చేస్తున్న సిబ్బందిని తొలగించి, ఆస్పత్రిని పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement