ఫుల్‌గా తాగి డ్యూటీకి వచ్చిన ఓ ఉద్యోగి తాను పనిచేస్తున్న చోటనే యూరిన్ చేసిన ఘటన మహబుబాబాద్ జిల్లాలో జరిగింది. మహబుబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన వారి ముందే తాత్కాలిక ఉద్యోగి జిప్ తీసి అక్కడ ఉన్న డస్ట్‌బిన్‌లో యూరిన్ (ఉచ్చ) చేయడాన్ని అందరూ తిట్టిపోస్తున్నారు. ఇదేం పనిరా నాయనా అంటూ ఇష్టమున్నట్టు తిడుతున్నారు. ఒక ఏజెన్సీ ద్వారా తాత్కాలికంగా నియమితుడైన ఆ ఉద్యోగి ఆస్పత్రికి రోజూ మద్యం తాగి రావడమే కాకుండా పట్టపగలు అందరూ చూస్తుండగానే ఇట్లాంటి రోత పనికి పాల్పడ్డాడు.
ఇక.. అదికూడా ఆస్పత్రికి వచ్చిన వారికి లేడీ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుండగానే ఆ పక్కనే ఉన్న డస్ట్‌బిన్‌లో జిప్ తీసి యూరిన్ చేశాడు. దీనిపై రోగులు, సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆస్పత్రి సూపరింటెండెంట్ అస్సలు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి దారుణమైన, రోత పనులు చేస్తున్న సిబ్బందిని తొలగించి, ఆస్పత్రిని పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలని కోరుతున్నారు.