Friday, November 22, 2024

Drunk and drive | 10 రోజుల్లోనే 1600 మందిపై కేసులు..

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కేవలం పది రోజుల్లోనే 1,600 మందికిపైగా మందుబాబులు అడ్డంగా దొరికిపోయారు. జూలై 1 నుంచి జులై 10 వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 1,614 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ క్ర‌మంలో 992 మందిపై చార్జిషీట్లు నమోదు చేశారు. వారిలో 55 మందికి 15 రోజుల జైలు శిక్ష పడింది. ఎనిమిది మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారి నుంచి 21 లక్షల 36 వేల రూపాయల జరిమానాను పోలీసులు వసూలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడుతున్న వారిలో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ఉండటం గమనార్హం. ట్రాఫిక్ పోలీసులు అత్యధికంగా 1346 ద్విచక్ర వాహనాల‌పై కేసులు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement