Monday, November 18, 2024

Drunken Drive | తాగి తోలారు.. జైల్లో ప‌డ్డారు!

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ హైద‌రాబాద్ : వారాంతాల్లో పూటుగా మద్యం తాగి రోడ్లపైకి వచ్చే మందుబాబులపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ చర్యలు ముమ్మరం చేశారు. కాగా శుక్ర, శని వారాల్లో రాత్రి విస్తృతంగా సోదాలు చేసి తాగిన మైకంలో వాహనాలు నడిపిన 212 మందిని అరెస్టు చేశారు.

వారిని న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్లు సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. కాగా పట్టుబడ్డ వారిలో ద్విచక్ర వాహన దారులే అధికంగా ఉన్నారు. 165 మంది ద్విచక్ర వాహనదారులు కాగా 34 మంది కార్లు తదితర నాలుగు చక్ర వాహనాలు, ముగ్గురు భారీ వాహన డ్రైవర్ల తోపాటు పదిమంది మద్య మత్తులో ఆటోలు నడుపుతూ పట్టుబడ్డారు.

- Advertisement -

21 మంది స్పృహ కూడా లేనంతగా మత్తులో ఉండడం పోలీసులు గమనించారు వారిలో బ్లడ్‌ ఆల్కహాల్‌ కాన్సన్టేష్రన్‌ 100 మిల్లీలీటర్ల రక్తం నమూనాలో 200 నుంచి 550 గ్రాములు ఆల్కహాల్‌ ఉన్నట్లు గుర్తించారు. మద్యం మత్తుల వాహనాలు నడిపిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అలా ప్రమాదాలకు కారణమయ్యే వారిపై భారత న్యాయ సంహిత సెక్షన్‌ 105 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం మత్తులో వాహనాలు నడిపించకూడదని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement