Sunday, December 22, 2024

Breaking | శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.7కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఇద్దరి నుంచి రూ.7కోట్ల విలువైన డ్రగ్స్ ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకాక్‌ నుంచి వస్తున్న ప్రయాణికులు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారని ఇంటెలిజెన్స్‌ సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌ డీఆర్‌ఐ అధికారులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని సోదాలు చేపట్టారు. సోదాల్లో వారి వద్ద సుమారు 7 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement