హైదరాబాద్: మాదాపూర్ ఓయో రూమ్లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహింతి పట్టుబడ్డారు. ఆయనతోపాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో కన్హా మహంతి పాల్గొన్నట్లు తెలుస్తున్నది. అతడు ప్రముఖ టీవీ షోలలో కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. హైదరాబాద్లో కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని కొరియర్స్ ద్వారా బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి పార్టీ చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. వారిపాటు ప్రియాంక స్నేహితురాలు, ఒడిశాకు చెందిన ఆర్కిటెక్ట్ షాకి, స్టాక్ ట్రేడర్ గంగాధర్ కూడా ఈ పార్టీ పాల్గొన్నారు. వారి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్తోపాటు మరో రెండు రకాల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.