న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పదిరోజుల వ్యవధిలో ఫిలింనగర్ లో రెండోసారి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్ లోని పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్నాడు ఓ వ్యక్తి. అతన్ని బెంగళూరుకు చెందిన క్యాప్ డ్రైవర్ బాబు కిరణ్ గా గుర్తించారు. డ్రగ్స్ అమ్ముతున్నాడనే సమాచారంతో పబ్ పార్కింగ్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అధికారులు. మరోవైపు.. బాబు కిరణ్ నుంచి 20 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీన పరుచుకున్నారు..
కాగా.. పబ్ కు వచ్చే కొంత మందికి డ్రగ్స్ అమ్మినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే.. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. గత కొంతకాలం నుంచి పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్ అమ్ముతున్నాడు బాబు కిరణ్. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాబుకిరణ్ ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నాడు.. ఎంతకాలంగా డ్రగ్స్ బిజినెస్ జరుపుతున్నాడని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో బాబు కిరణ్ ఉన్నాడు.