Wednesday, January 8, 2025

NZB | దవాఖానలో మందుల కుంభకోణం.. ఎమ్మెల్యే తనిఖీల్లో బయటపడ్డ వైనం

నిజామాబాద్ ప్రతినిధి, జనవరి 7(ఆంధ్రప్రభ ) : నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలో రోగులు రాకున్నా వచ్చినట్టు వైద్య సేవలతో పాటు మందులు అందజేసినట్టు రికార్డులో నమోదు చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. దవాఖానకు రోగులు రాకున్నా ఇతరుల పేర్లు తప్పుగా రికార్డులో నమోదు చేసి మందులు స్వాహా చేస్తున్న తతంగం ఎమ్మెల్యే ఆకస్మికంగా బస్తీ దవాఖాన తనిఖీ చేయడంతో వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని 34వ డివిజన్ లోని మిర్చి కాంపౌండ్ లోని బస్తీ దవాఖానాను మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూరనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా బస్తీ దవాఖానలోని రికార్డులో ఓపీ సేవలను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రతిరోజు సుమారు 80మంది రోగులకు వైద్య సేవలు అందజేయడంతో పాటు మందులు అందజేసినట్టు రికార్డులు నమోదు చేశారు. రికార్డులో నమోదు చేసిన రోగులకు స్వయంగా ఎమ్మెల్యే ఫోన్ చేయగా మే ము నిజామాబాద్ ప్రాంతా నికి చెందిన వారము కాదని చెప్పడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. ఈ ఘటనపై బస్తీ దవాఖాన వైద్యురాలిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

రోగులు రాకుండా వచ్చినట్టు తప్పుగా రికార్డు నమోదు చేయడమే కాకుం డా ఆసుపత్రికి వచ్చిన రోగులను పట్టించుకోక పోవ డం ఏమిటి అని ప్రశ్నించారు. బస్తీ దవఖానలో విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్వయంగా ఎమ్మెల్యే డీఎంహెచ్ఓ కు ఫోన్ లో ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement