ప్రభ న్యూస్, గుమ్మడిదల : గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా డ్రెస్ తయారు చేస్తున్న ముఠాను తెలంగాణ నార్కోటిక్స్, స్థానిక పోలీసులు గుట్టు రట్టు చేశారు. జిల్లా ఎస్పీ రూపేష్ ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి
గుమ్మడిదల గ్రామానికి చెందిన గోస్కొండ అంజిరెడ్డి, కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ గౌడ్, సాయిగౌడ్ మరో వ్యక్తి రాకేష్‌తో కలిసి కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ గౌడ్ భూమిలో ఉన్న డెయిరీ కోళ్ల ఫారం షెడ్డులో గత ఆరు నెలల నుంచి డ్రగ్స్ తయారీ చేస్తున్నారు.
సమాచారం అందుకున్న నార్కోటిక్స్ విభాగం, స్థానిక పోలీసులు జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్ లో వీరి నేరం బయటపడిందని జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. ఇక్కడ తయారయ్యే ఆల్ఫాజోమ్ ను హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం అంజిరెడ్డి, సాయిగౌడ్, రాకేష్ కస్టడీలో ఉన్నారని… ప్రభాకర్ గౌడ్ పరారీలో ఉన్నారని తెలిపారు. ఇక్కడ తయారయ్యే ఆల్ఫాజామ్ డ్రగ్స్ దాదాపు 40 నుంచి 50 లక్షలు, ముడిసరుకు 60 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేసినట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు.
మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం : జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్
ఎవరైనా అనుమానితంగా తమ తమ ప్రాంతాలలో ఇలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ విలేకరుల సమావేశంలో ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చినటువంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు.
అలా సమాచారం ఇవ్వడం వలన త్వరితగతిన ఇలాంటి వారిని పట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవడానికి సులువుగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు లో పాల్గొన్న నార్కోటిక్ విభాగాన్ని స్థానిక పోలోసులను ఎస్పి అభినందించారు. ఆయనతో పాటు డీఎస్పీ సీఐ ఎస్ఐ లు పాల్గొన్నారు.