… నాడు గుర్తుకురాని రైతులు
… నేడ దొంగ దీక్షలు, ధర్నాలు
చిగురు మామిడి, (ప్రభ న్యూస్) : రాష్ట్రంలో పకృతి వైపరీత్యంతో కరువు వచ్చిందని, గత వర్షాకాలంలో ఆశించిన మేర వర్షాలు కురవక పోవడంతో ఈ వేసవిలో నీటి కొరత ఏర్పడిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం చిగురుమామిడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్రంలో బిఆర్ఎస్, కేంద్రంలో బిజెపి పార్టీలు మొన్నటి వరకు అధికారంలో ఉన్నాయని, నాడు గుర్తుకు రాని రైతులు నేడు పార్లమెంట్ ఎలక్షన్ల ఓట్ల కోసం రైతు దీక్ష పేరుతో బిజెపి, బిఆర్ఎస్ దొంగ దీక్షలు చేస్తున్నాయన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏనాడు ఒక రైతును పట్టించుకోలేదని, ఎండిన పంటలను పరిశీలించక పోవడంతో పాటు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదన్నారు. పకృతి వైపరీత్యంతో ఎండిన పంటలకు నష్టపరిహరo అందించడంలో కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమైందన్నారు.
కరువు కాంగ్రెస్ తెచ్చింది కాదని.. పకృతి వైపరీత్యమే కారణమన్నారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుతం ఎంపీ బండి సంజయ్ మొన్నటి వరకు రాముని ఫోటోతో అక్షింతలతో రాజకీయం చేసి నేడు రైతుల వద్దకు వెళుతూ దొంగ దీక్షలు చేస్తూ ఓట్లు అడుగుతున్నాడన్నారు. పకృతి వైపరీత్యం ఎండిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించే అవసరం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారో, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీని కూడా ఓడిస్తారన్నారన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల అమలు చేయడం జరిగిందని, ఎవరు కూడా అధైర్య పడవద్దని, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.