Friday, November 22, 2024

Drought – రేవంత్ స‌ర్కార్‌కు రైతుల ఉసురు త‌గులుద్ది – జగదీష్ రెడ్డి

సూర్యాపేటలో ఎండుతున్న పంట‌లు
కాంగ్రెస్ వ‌చ్చింది.. పంట త‌గుల‌బెట్టే దుస్థితి తెచ్చింది
పంట‌ల‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే జ‌గ‌దీష్ రెడ్డి

బీఆర్‌ఎస్ పార్టీని అప్రతిష్ఠపాలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని , కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని అన్నెపర్తి గ్రామంతో పాటు ఇతర గ్రామాలలో ఆయన నేడు పర్యటించారు.. ఈ సందర్భంగా ఎండిపోయిన వరి, మిరప తోటలను రైతులతో కలిసి సోమ‌వారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూ.. కేసీఆర్‌ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ వచ్చిన కొద్ది నెలల్లోనే రైతులు పంటలు తగలపెట్టుకునే దీన స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. .

ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే ,అధికారులు కూడా రైతుల వంక కన్నెత్తి చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాంగ్రెస్ మంత్రులకు రాజకీయాలు, అక్రమ వసూళ్లు, దందాలు తప్ప ,రైతుల గోడు పట్టట్లేదని అన్నారు ..జిల్లా మంత్రులు కోమటిరెడ్డి,.ఉత్తమ్ లు ఉత్తరకుమారులని, ప్రగల్భాలు పలకడం తప్పా దేనికి పనికిరారని అన్నారు… వారుకి ఎంతసేపు రాజకీయాలు చేయడం తప్ప రైతుల సంక్షేమం పట్టలేదని అన్నారు… కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య పూరిత వైఖరితో రైతులు మరింత అగాధంలోకి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు ..ఇప్పటికైనా కళ్ళు తెరిచి కరువుపై సర్వే చేయించి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు ..లేదంటే రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం అవుతుందని అన్నారు… ఎండిపోయిన వరి రైతులకు ఎకరాకు రూ.50 వేలు, మిరప రైతులకు రూ.80 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ,నల్గొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, brs నాయకులు, చెరుకు సుధాకర్, పంకజ్ యాదవ్.. దీప వెంకట్ రెడ్డి యాదయ్య గౌడ్, నాగరాజు, దేవేందర్, లింగుస్వామి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement