Friday, November 22, 2024

పల్లె దవాఖాన వైద్యులు బాధ్యతగా పనిచేయాలన్న‌ డా.కె.సుధాకర్ లాల్

బిజినేపల్లి మండలంలోని పాలెం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పల్లె దవాఖాన వైద్యులకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై ఒకరోజు ఓరియెంటెషన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సుధాకర్ లాల్ మాట్లాడుతూ… పల్లె దవాఖానాల సమర్థవంతంగా నిర్వహణ కోసం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక ఓరియెంటెషన్ నిర్వహించడం జరిగిందన్నారు. వైద్యులు తమ పరిధిలోని పల్లె దవాఖానాల్లో అమలవుతున్న కోవిడ్ వాక్సినేషన్, ఇమ్మునైజేషన్ కార్యక్రమం, కె.సి.ఆర్.కిట్, ఎన్. సి.డి., టి.బి., లెప్రసి, మలేరియా, పి.సి.పి.ఎన్. డి. టి. ఆక్ట్ తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరిగినది.

ఈ అవగాహన సమావేశాల ద్వారా మరింత సమర్థవంతంగా పల్లె దవాఖాన పరిధిలో అమలు చేసి నాణ్యమైన వైద్య సేవలు పల్లెల్లోని ప్రజలకు అందించాలని, సమయ పాలన పాటించాలని ఈ సందర్భంగా వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూ.హెచ్. ఓ. అధికారి డా.అబ్దుల్ వసి, డెప్యూటీ డి.ఎం.హెచ్. ఓ. డా.వెంకట్ దాస్, జిల్లా ఇమ్మునైజెషన్ అధికారి డా.సాయినాథ్ రెడ్డి, ప్రోగ్రాం అధికారులు డా.శ్రీకాంత్, డా.శ్రవణ్, ఎన్.హెచ్. ఎం. పి.ఓ. రేణయ్య, వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement