మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న తెలంగాణకు మహారాష్ట్ర, తెలంగాణ ఉభయ రాష్ట్రాల అధికారులు ఇవ్వాల నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రతి సంవత్సరం మార్చి ఒకటో తేదీన తాగునీటి అవసరాల నిమిత్తం 0.6 టీఎంసీ నీళ్లను విడుదల చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మంగళవారం దిగువకు నీళ్లను వదిలారు. ఈ నీటి విడుదల కార్యక్రమంలో కేంద్ర జల సంఘం నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్ రావు, నాందేడ్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ A.S చౌగోల్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుకుమార్ పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement