బైంసా : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కొనసాగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపికలో తమకు అన్యాయం జరుగుతుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల స్థలాలలో ప్రస్తుత డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారని, ఇప్పుడు స్థలాలు ఇచ్చిన మాకే ఇండ్లు ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఇప్పటి బీఆర్ఎస్ సర్కార్ వాటిని రద్దు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చినా… ఈరోజు ఇల్లు కేటాయించకపోవడంతో హామీ కాస్త తుంగలో తొక్కారాని మండిపడ్డారు. ప్రస్తుత డబుల్ బెడ్ రూమ్స్ లిస్టులో తమ పేర్లు లేవని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక గార్డెన్ సమీపంలో ఆందోళనకు దిగగా ఆందోళనకారులకు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. మా స్థలాలు మాకు కావాలని ఆందోళన చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల స్థలాల బాధితులకు ఎట్టకేలకు నిరాశ మిగిలింది. స్థలాలు మాయి ఇండ్లు వేరే వాళ్లకు అంటూ పలువురు రోదనలు మిన్నంటాయి.