Saturday, November 23, 2024

కరీంనగర్ కు డబుల్ ధమాకా.. ఉమ్మడి జిల్లా నుండి ఇద్దరికి అవకాశం

తెలంగాణ ఎమ్మెల్సీ స్థానాల‌కు అభ్య‌ర్థుల కేటాయింపులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒకే జిల్లా నుండి ఇద్ద‌రికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ద‌క్కింది. క‌రీంన‌గ‌ర్ ఉమ్మ‌డి జిల్లా నుండి డ‌బుల్ ధ‌మాకాగా ఇద్ద‌రికి అవ‌కాశ‌మిచ్చారు సీఎం కేసీఆర్. పోరాటాల పురిటిగడ్డ కరీంనగర్ లో ఇద్ద‌రికి ఎమ్మెల్సీలుగా అవ‌కాశం దక్కింది. మంగళవారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కు పెద్ద పీట వేశారు. ఆరుగురు అభ్యర్థుల్లో ఉమ్మడి జిల్లాలోని హుజురాబాద్ నుండి పాడి కౌశిక్ రెడ్డి కి, ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన మాజీ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి కి అవకాశం ఇచ్చారు. దీంతో ఈ ఉమ్మ‌డి జిల్లా నుండి ఇద్ద‌రికి అవ‌కాశం రావ‌డంతో డ‌బుల్ ధ‌మాకా కొట్టిన‌ట్ల‌య్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement