Friday, November 22, 2024

TS: 3, 4 తేదీల్లో ఇంటింటికి ఓటింగ్..

85ఏళ్లు పై బ‌డిన వారికి అవ‌కాశం
హైద‌రాబాద్ లో మొత్తం 22ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు
1944 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

హైద‌రాబాద్ లో 85 ఏళ్లు పైబడిన ఓటర్లకు ఇంటింటికి ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు.. మే 3, 4 తేదీల్లో ఎన్నిక‌ల సిబ్బంది వారి వారి గృహాల‌కు వెళ్లి ఓట్ల‌ను స్వీక‌రిస్తార‌ని చెప్పారు.. హైద‌రాబాద్ లోని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నియోజకవర్గంలో 22 లక్షల 17 వేల 94 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. వీరిలో 11,25,310 మంది పురుషులు, 10,91,587 మంది మహిళలు, 107 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు.

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 57 నామినేషన్లు దాఖలయ్యాయని, పరిశీలనలో నిబంధనలు ఉల్లంఘించినందుకు 19మంది అభ్యర్థులు తిరస్కరించారని వివరించారు. ప్ర‌స్తుతం పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్ పేపర్ల ముద్ర‌ణ కొన‌సాగుతున్న‌ద‌ని చెప్పారు.. హైదరాబాద్‌లో 1944 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు 203మంది సెక్టోరల్ అధికారులను నియమించామ‌న్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement