హైదరాబాద్: ఈ నెల 16న ప్రారంభించనున్న జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయంతో సుపరిపాలన మరింత బలోపేతమవుతుందని అన్నారు ఐటి, పట్టణ మునిసిపల్ పరిపాలన శాఖ మంత్రి కెటిఆర్ .. వార్డు కార్యాలయాల ఏర్పాటు నేపథ్యంలో ఆయన నేడు జీహెచ్‌ఎంసీ బిఆర్ఎస్ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం బిఆర్ఎస్ చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పరిపాలన వికేంద్రీకరణ స్ఫూర్తితోనే వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
” వార్డు కార్యాలయ వ్యవస్థను కార్పొరేటర్లు విస్త్రృతంగా ఉపయోగించుకోవాలి. బిఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయం. కార్పొరేటర్లు ఆయా వార్డుల్లో బిఆర్ఎస్ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయాలి.” అని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. వార్డు కార్యాలయాల వల్ల లభించే సేవలు, కార్యక్రమాల గురించి ప్రజలలోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు.. అలాగే ఏడాదిపాటు పార్టీ కార్యకలాపాలను విస్త్రృతం చేయాలని కార్పొరేటర్లను కోరారు..