Thursday, November 21, 2024

డోంట్‌ వర్రీ.. ఇప్పుడు తప్పితే మళ్లీ రాయొచ్చు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సోమవారం(ఈనెల 25) నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు జరిగే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షల్లో ఒకవేళ విద్యార్థులు ఫెయిల్‌ అయితే వారు మళ్లిd మార్చ్‌ లేదా ఏప్రిల్‌ల్లో సప్లమెంటరీ పరీక్షలు రాయాల్సిందేనని ఇంటర్మీ డియ ట్‌ విద్యాశాఖ కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ స్పష్టం చేశారు.

సోమవారం నుంచి ఇం టర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు ప్రారంభంకాను న్న నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ కమిషనర్‌ ఉమర్‌ జలీల్‌ నాంపల్లిలోని విద్యా భవన్‌లో పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కరోనా వచ్చి.. పరీక్షలు రాయలేని స్థితిలో ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి స్పెషల్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తామన్నారు.

ఒకవేళ కరోనా థార్డ్‌ వేవ్‌ వచ్చి మార్చిలో వార్షిక పరీక్షలను నిర్వహించలేని పరి స్థితులు తలెత్తితే ఈ పరీక్షలను ప్రామాణికంగా తీసుకుని, ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా సెకండ్‌ ఇయర్‌లో మార్కులను వేస్తామని చెప్పారు. ఇప్పటికే వీరు టెన్త్‌, ఫస్ట్‌ ఇయర్‌ వార్షిక పరీక్షలు రాయకుండానే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్‌ అయ్యారని, వీరికి ఇప్పుడు పరీక్షలను నిర్వహించకుంటే విద్యార్థులు నష్టపోయే ప్రమాద ముందన్నారు. అందుకే రద్దు అయిన ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలను సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు నిర్వ హిస్తున్నా మన్నారు. విద్యార్థులు భయం, ఒత్తిడి లేకుం డా పరీక్షలకు హాజరు కావాలని ఆయన అన్నారు.

గంట ముందే అనుమతి…
పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థులను గంట ముందే అనుమతించనున్నారు. పరీక్ష సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్య ఓఎం ఆర్‌ షీట్‌లో విద్యార్థులు బయోడేటాను రాయాల్సి ఉంటుంది. 9 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని కమిషనర్‌ తెలిపారు. ప్రింటెడ్‌ మెటీరియల్‌, సెల్‌ఫోన్స్‌, పేజర్స్‌, క్యాల్కులెటర్‌ ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను లోనికి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement