Thursday, November 7, 2024

ఉచిత విద్యుత్‌ వద్దన్న.. కాంగ్రెస్‌ను బొంద పెడదాం..పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

సుల్తానాబాద్‌, జూలై 20 (ప్రభన్యూస్‌): రైతులకు ఉచిత విద్యుత్‌ వద్దన్న కాంగ్రెస్‌ పార్టీ బొంద పెడదామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సుల్తానాబాద్‌ మండలం చిన్నకల్వల గ్రామ రైతు వేదికలో నిర్వహించిన రైతన్న మేలుకో.. సమావేశంలో ఎమ్మెల్యే దాసరి పాల్గొని రైతులకు ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు మూడు పంటలు పండించేలా ప్రాజెక్టుల రూపకల్పన చేసి నిరంతరం నీరుతో పాటు 24 గంటలు విద్యుత్‌ను అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారన్నారు. అధికారంలోకి రాకముందే రైతన్నలపై కపట ప్రేమను చూపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రైతులకు మూడు గంటలు విద్యుత్‌ ఇస్తే సరిపోతుందని మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.

కాంగ్రెస్‌ పార్టీని రాబోయే ఎన్నికలలో తరిమి కొట్టాలని, రైతన్నలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌ రెడ్డి తన నిజస్వరూపం బయట పెట్టారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రైతులు ఎదుర్కొన్న కరెంటు- కష్టాలను అంత తొందరగా ఎలా మర్చిపోతామని గుర్తు చేశారు. అన్నదాత మూడు పంటలు పండించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఉంటే మూడు గంటలు కరెంటు- చాలు అని కాంగ్రెస్‌ పేర్కొనడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్‌ నిరంతరం రైతన్న కోసమే పాటు పడుతూ.. 60 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని కేవలం తొమ్మిదేళ్లలొనే చేసి చూపించిన బీఆర్‌ఎస్‌కు రైతులు, ప్రజలు అండగా ఉండాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

ఈకార్యక్రమంలో జిల్లా రైతు సవిుతి జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంత రెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, రైతు సమితి మండల కో ఆర్డినేటర్‌ బోయిని రాజ మల్లయ్య, మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్‌ చందర్‌రావు, ఏఎంసీ ఛైర్మెన్‌ బుర్ర మౌనిక శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ముత్యం సునీత రమేష్‌, పీఏసీఎస్‌ ఛైర్మెన్‌లు మోహన్‌ రావు, జూపల్లి సందీప్‌ రావు, యూత్‌ మండలాధ్యక్షుడు గుడుగుల సతీష్‌, కన్వీనర్‌లు దీకొండ భూమేష్‌, తాళ్లపెల్లి మనోజ్‌ గౌడ్‌, సర్పంచ్‌లు ఎరుకొండ రమేష్‌, సాగర్‌రావు, మూల స్వరూప, కోమల సారయ్య, ఎంపీటీసీలు సంపత్‌, ఫక్కీర్‌ యాదవ్‌, సీనియర్‌ నాయకుడు కృష్ణారావు, గ్రామశాఖ అధ్యక్షులు భూమయ్య, రైతు సమితి కో ఆర్డినేటర్‌లు, రైతులు, బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement