Monday, January 20, 2025

WGL | దళారులను నమ్మకండి… కాకర్లపూడి విక్రాంత్

వాజేడు, జనవరి 20 ఆంధ్రప్రభ : ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ అన్నారు. సోమవారం వాజేడు మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు ఇప్పిస్తామని కొంతమంది పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి రావడం జరిగిందన్నారు.

ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోకండి అన్నారు. గుడ్డిగా నమ్మి డబ్బులు ఎవరికీ ఇవ్వొద్దని, అర్హులైన ప్రతి పేదవారిని అధికారులే గుర్తించి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దంతులూరి విశ్వనాథ ప్రసాదరాజు, ఎస్కే కాజావలి, మల్లెల దుర్గారావు, చెన్నం ఎల్లయ్య, కాకర్లపూడి కళ్యాణ్, చిక్కుడి వెంకటేశ్వర్లు, సుధీర్ భీమయ్య, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement