మంత్రి జగదీశ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించింది. 48గంటల పాటు ర్యాలీలు, సభలు, సమావేశాలకు హాజరుకావొద్దని ఇవ్వాల (శనివారం) ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మీడియాతో ఊడా మాట్లాడొద్దని.. ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఆదేశించింది. ఈ సాయంత్రం నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఈసీ పేర్కొంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని జగదీశ్‌రెడ్డి అన్నారని బీజేపీ చేసిన ఫిర్యాదు చేయగా.. తొలుత మంత్రి నుంచి వివరణ కోరింది ఎలక్షన్ కమిషన్.
కాగా, ఇవ్వాల మంత్రి జగదీశ్‌రెడ్డి ఇచ్చిన వివరణ సహేతుకంగా లేదన్న కారణంతో ఈసీ ఇట్లాంటి యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం మునుగోడులో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈసీ ఆదేశాల మేరకు జిల్లా మంత్రిగా జగదీశ్‌రెడ్డి ఈ సభకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.