Monday, November 18, 2024

Minister Tummala : ప‌త్తి కొనుగోళ్లు ఆలస్యం చేయొద్దు

  • అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగితే స‌హించం
  • మార్కెంటింగ్​ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష
  • సమస్యలుంటే నా వాట్సాప్​కు ఫిర్యాదు చేయాలి
  • రైతులకు సూచించిన మంత్రి తుమ్మల
  • అకాల వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : మార్కెట్ యార్డులు, మిల్లుల‌కు వ‌చ్చిన ప‌త్తిని వెంట‌నే కొనుగోలు చేయాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ‌, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆదేశించారు. శుక్ర‌వారం రాష్ట్ర స‌చివాల‌యంలో మార్కెటింగ్ శాఖ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. జిల్లా అధికారులు, కార్య‌ద‌ర్శులు నిత్యం రైతుల‌కు అందుబాటులో ఉండాల‌ని సూచించారు.

కొనుగోలు అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగితే స‌హించం…
ప‌త్తి కొనుగోలులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగితే స‌హించేది లేద‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. రైతుల‌కు స‌మ‌స్య‌లు ఎదురైతే వాట్సాప్ నెంబ‌ర్‌ 8897281111కి ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. అకాల వర్షాలు పడుతున్నందున అధికారులతో పాటు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement