- రైతులపై కొత్తగా కేసులు పెట్టలేదు
- ఆందోళన సమయంలో ఉన్న కేసులే
- సెక్షన్ 307 ఎవరిపై నమోదు చేయలేదు
- నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి.జానకి షర్మిల
- ఆంధ్రప్రభ స్మార్ట్, నిర్మల్ : ఇథనాల్ ఆందోళనలో భాగంగా ఎవరిపైనా కొత్తగా కేసులు నమోదు చేయలేదని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి.జానకి షర్మిల స్పష్టం చేశారు. గత రెండు రోజుల నుంచి సామాజిక, ఇతరత్రా మాధ్యమాలలో ప్రచారమవుతున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల రైతులకు ఆమె విజ్ఞప్తి చేశారు. అపోహాలు కూడా వద్దని అన్నారు. ఆందోళనల సమయంలో చట్ట ప్రకారం నమోదైన కేసులు మాత్రమే ఉన్నాయన్నారు.
సెక్షన్ 307 ఎవరిపై నమోదు చేయలేదు…
ఇథనాల్ ఆందోళన సంఘటనపై ఏ రైతు పైనా సెక్షన్ 307 ఎవరిపై నమోదు చేయలేదని ఎస్పీ స్పష్టం చేశారు.
తాజాగా ఆయా గ్రామస్తులపై ఎలాంటి కేసులను నమోదు చేయలేదని గుర్తు చేశారు. ఈ మధ్య కొంతమంది పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు.