Saturday, January 18, 2025

TG | త‌ప్పుడు ప్ర‌చారం న‌మ్మొద్దు.. మంత్రి పొన్నం

  • పాత రేష‌న్ కార్డులు తొల‌గించ‌డం లేదు
  • ఇప్ప‌టికే 90ల‌క్ష‌ల రేష‌న్ కార్డులు
  • జనవరి 26నుండి కొత్త కార్డులు
  • త్వ‌ర‌లో కొత్త‌మండ‌లంగా ఇందుర్తి


క‌రీంన‌గ‌ర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కొత్త రేష‌న్ కార్డుల మంజూరుకు ఇచ్చే ప్ర‌క్రియ కోసం గ్రామాల్లో స‌ర్వే జ‌రుగుతోంద‌ని, ఈ స‌ర్వేతో పాత రేష‌న్ కార్డులు తొల‌గిపోతాయ‌న్న‌ త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని రాష్ట్ర‌ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని ఆయ‌న‌ స్పష్టం చేశారు. అర్హత ఉండి రేషన్ కార్డులు లేని వారికి జనవరి 26 నుండి కొత్త కార్డులు ప్రభుత్వం ఇస్తుందని, ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే.. సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చని మంత్రి పొన్నం సూచించారు.

జ‌న‌వ‌రి 26 నుంచి రేష‌న్‌కార్డులు…
‘జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతోంది. గ‌త ప‌దేళ్లుగా రేషన్ కార్డులు లేకుండా, కొత్తగా పెళ్లి అయిన వారికి, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేస్తుంది’ అని మంత్రి తెలిపారు. ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయ‌ని, రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వొచ్చున‌ని చెప్పారు.

త్వ‌ర‌లో కొత్త‌మండ‌లంగా ఇందుర్తి…
‘పాత రేషన్ కార్డులు తొలగించడం లేదు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే న‌మ్మొద్దు. కుల సర్వే ఆధారంగా అప్లికేషన్ల సమాచారంతో కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇందుర్తిలో 71 కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు వస్తున్నాయి. 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా రూ.12 వేలు ఇస్తున్నాం. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నాం. భూమి లేని రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఇందుర్తి మండలం ఏర్పడుతుంది’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement