Saturday, November 23, 2024

TG | అధైర్య పడొద్దు.. అండగా ఉంటా: సీఎం రేవంత్

మద్దూరులో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ రెడ్డి


కోస్గి, మద్దూరు, అక్టోబర్ 26( ఆంధ్రప్రభ): కాంగ్రెస్ కార్యకర్త అకాల మృతి చెందడం బాధాకరమని, అధైర్య పడొద్దని, అండగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్త కల్లపు సతీష్ దశదినకర్మ కార్యక్రమానికి హాజరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సతీష్ చిత్రపటానికి ముఖ్యమంత్రి ఘన నివాళులర్పించారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి నేరుగా హెలికాప్టర్ లో మద్దూరుకు 12 గంటలకు చేరుకున్నారు. అక్కడి నుండి సీఎం కాన్వాయ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సతీష్ ఇంటికి చేరుకొని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు.

- Advertisement -

అనంతరం అక్కడి నుండి హెలికాప్టర్ లో సీఎం కొడంగల్ కు బయలుదేరారు. మద్దూరులో సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం వెంట మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివరాజ్, సొసైటీ చైర్మన్ నర్సింలు, కోస్గి మార్కెట్ చైర్మన్ బీములు, వైస్ చైర్మన్ గిరి ప్రసాద్ రెడ్డి, కోస్గి మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డితో పాటు, మల్లికార్జున, తిరుపతిరెడ్డి, సంజీవ్, మహేందర్ రెడ్డి, రవికుమార్, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement